19-03-2025 01:38:30 AM
ధర్మారెడ్డి పల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం
గజ్వేల్, మార్చి 18 : వ్యవసాయ రైతులతోపాటు పాడి రైతులకు అండగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అండగా ఉంటుందని ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ధర్మారెడ్డి పల్లి గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు పాడి పశువులు నెలవారి ఆదాయ వనరుగా మారాయి అన్నారు. అందుకే రైతులకు అండగా నిలవాలని ఉద్దేశంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రైతులు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి రమేష్ బాబు, ఏఎంసీ కార్యదర్శి జాన్ వెస్లీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పాలక వర్గ సభ్యులు మరియు నాయకులు సుఖేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ రమేష్ బాబు సిబ్బంది 105 గేదెలు, 20 ఆవులకు గర్భకోశ నివారణ వ్యాధి, సాధారణ జబ్బులకు చికిత్స చేశారు.