calender_icon.png 15 January, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండగా ఉంటాం.. ఆదుకుంటాం

05-09-2024 12:00:00 AM

ఊహించనివిధంగా వరదలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. ఎంతోమంది సర్వం కోల్పోయారు. అలాంటివారిని ఆదుకునేందుకు టాలీవుడ్ సినీహీరోలు ముందుకొచ్చారు. ఇప్పటికే కొంతమంది నటులు భారీ విరాళం ప్రకటించగా.. అదే బాటలో మరికొందరు తమవంతు సాయం ప్రకటించి వరద బాధితులకు అండగా నిలిచారు. హీరో చిరంజీవి సాయంలో ముందు వరుసలో ఉంటారు.

ఆయన తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.6 కోట్ల భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున రెండు కోట్లు విరాళం ఇచ్చారు.

అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. మెగా హీరో రామ్ చరణ్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అక్కినేని కుటుంబం తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున  ప్రకటించింది.  సినీ నటుడు అలీ రెండు రాష్ట్రాలకు రూ.3 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.