calender_icon.png 24 February, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలియా బేగం కుటుంబానికి అండగా ఉంటాం

21-02-2025 12:00:00 AM

 ఎస్పీ చెన్నూరి రూపేష్ 

మునిపల్లి, ఫిబ్రవరి 20: మృతురాలు ఆలియా బేగం కుటుంబానికి అండగా ఉంటామని సంగారెడ్డి ఎస్పి చెన్నూరు రూపేష్ తెలిపారు. గురువారం మునిపల్లి మండలం లోని అంతారం గ్రామం లో మృతురాలు ఆలియా బేగం కుటుంబాన్ని జిల్లా ఎస్పీ రూపేష్ పరామర్శించిన పలు విషయాలు తెలుసుకున్నారు. 

ఈనెల  11న  రాత్రి 7:30 గంటల సమయంలో మునిపల్లి మండలం, అంతారం గ్రామంలో మహ్మద్ ఇస్మాయిల్, కొల్లూరి వీరా రెడ్డి, విజయ్ రెడ్డిల మద్య జరిగిన గొడవలో విడిపించడానికి అడ్డుగా వెళ్ళిన ఇస్మాయిల్ కూతురు ఆలియా బేగం (15)  ప్రమాదవశాత్తు గాయపడి, చికిత్స పొందుతూ  16 న మరణించడం జరిగిందని తెలిపారు.

అలియా బేగం  మరణం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు. మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  ఇందుకు కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని అన్నారు.  మృతురాలు ఆలియా బేగంపైన వారికి ఎలాంటి కక్షలేదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించాలని ఎస్పీ  తెలిపారు. 

ఎవరైనా సామాజిక మాద్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు పెట్టిన, వ్యాక్యలు చేసిన అట్టి వ్యక్తులపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.   ఎస్పీ వెంట సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్, మునిపల్లి ఎస్పీ రాజేష్ నాయక్ సిబ్బంది తదితరులు ఉన్నారు.