16-03-2025 03:43:02 PM
డిఈకి స్పష్టం చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ లో సక్రమంగా నీరు సరఫరా చేయకుంటే ధర్నా చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Malla Reddy) సంబంధిత డీఈకి స్పష్టం చేశారు. మేడ్చల్ కు చెందిన పలువురు మల్లారెడ్డిని కలిసి నీటి సమస్యను వివరించారు. పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని రోజులుగా కొన్ని ప్రాంతాలకు నీరు సరఫరా కావడం లేదని తెలిపారు. దీంతో మల్లారెడ్డి మిషన్ భగీరథ డి ఈ కి ఫోన్ చేసి సమస్యను వివరించారు. సక్రమంగా నీరు సరఫరా చేయకుంటే ధర్నా చేస్తానన్నారు. ప్రతిరోజు ఒక గంట పాటు నీరు సరఫరా చేయాలన్నారు.