calender_icon.png 31 January, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీల్లో మిగిలిన డబ్బులను వచ్చే ఏడాది ఖర్చు చేస్తాం

31-01-2025 01:02:56 AM

నాగర్ కర్నూల్, జనవరి 30 (విజయక్రాంతి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ నెల 15న  నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో శివ రా మాలయ కమిటీ అధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలకు గ్రామస్తులనుండి విరాళాలు సేకరించి సరైన వసతులు కల్పిం చలేదన్న విషయంపై విజయక్రాంతి బండ లాగుడు పోటీల్లో భారీగా వసూళ్లు అనే శీర్షికన వార్త కథనాన్ని ప్రచురించగా నిర్వహ ణ కమిటీ స్పందించింది.

చందాదారులుగా భాగం పంచుకున్న ప్రతి ఒక్కరి పేర్లను న మోదు చేసి ఇచ్చిన డబ్బు వివరాలను గురువారం తుడుకుర్తి గ్రామంలోని ప్రధాన ఆలయంలో గ్రామస్థుల ముందు ప్రకటిం చారు. 

మొత్తంగా 8,00,478 రూపాయలు చందాల రూపంలో వచ్చాయని అందులో బండలాగుడు పోటీల నిర్వహణకు 5, 90, 400 ఖర్చు చేసినట్లు ప్రకటించారు. మిగిలిన 2,10,078 డబ్బులను కమిటీలోనే కొనసాగించి వచ్చే ఏడాది నిర్వహించే బండ లాగుడు పోటీలకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా అంతకు ముందు బండ లాగుడు పోటీలు,  బొడ్రాయి ప్రతిష్ట కార్యక్ర మంలో ప్రజల నుంచి సేకరించిన చందాలు, ఖర్చుల వివరాలను కూడా గ్రామ పెద్దలు గ్రామస్తుల ముందు ప్రదర్శించాలని ఆలయ కమిటీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం వారికి సమాచారం ఇచ్చినప్ప టికీ  ముందుకు రాలేదని మరోసారి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రక టించారు.