ఆర్మూర్ (విజయక్రాంతి): ఈనెల 7వ తేదీన హైదరాబాదులో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు సంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం చేయాలని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేల గొంతులు లక్ష డప్పులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీస్ మాజీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గత ఏడాది ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా కాలయాపన చేసిందని బాలు ఆరోపించారు. ఈ ఐదు నెలలుగా విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ లో మాదిగలకు తీవ్రంగా నష్టం జరిగింది. ఇవాళ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్న ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తలోగ్గి నిన్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి 5,6 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు రాగానే నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిన రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన తన మాటపై నిలబతారో లేదో మాదిగలలో అనుమానం మొదలైంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్గీకరణను అమలు చేస్తే ఏడో తేదీన లక్ష డబ్బులు వేల గొంతులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని లేనిపక్షంలో తెలంగాణ ప్రభుత్వంపై చావు డబ్బులు మోగిస్తామని బాలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ మండల ఇంచార్జ్ శ్యామ్ మాదిగ, మాదిగ యునైటెడ్ ప్రాంట్ కొక్కెర భూమన్న మాదిగ, ఆర్మూర్ కళాబృందం నాయకులు సింగర్ చిట్టి బాబు, బార్ అసోసియేషన్ తెడ్డు నర్సయ్య, ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ, మోర్తాడ్ ఎక్స్ ఎంపీపీ చిన్నయ్య, MSP నాయకులు సుద్దపల్లి మార్కు, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి నూతుపల్లి సంతోష్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు నలూరి చింటు మాదిగ, గణేష్ మాదిగ, రాజా గంగారాం, పొన్నాల చంద్ర శేఖర్, ఎర్గట్ల వినోద్, రమేష్, ఉల్లెంగ సురేష్, నవీన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు అన్ని గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.