calender_icon.png 2 April, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీవీ గిరి నగర్ బస్తీ సమస్యలను పరిష్కరిస్తాం

24-03-2025 12:00:00 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): వివి నగర్ బస్తివాసుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ ఏ పావని వినయ్‌కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ వీవీ గిరి నగర్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం  బస్తి వాసులు  కార్పొరేటర్ కార్యాలయంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

వివి గిరి నగర్ లో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్ భవనం పై మరో అంతస్తు నిర్మించి బస్తి లోని యువతకు ఉపయోగకరంగా వుండేందుకు ‘జిమ్‘ ఏర్పాటు చేయా లని కార్పొరేటర్‌ను కోరారు. 

ఈ సందర్భంగా   సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్  మాట్లాడుతూ బస్తీల్లో  కమ్యూనిటీ హాల్ భవనాలు నిర్మించేది స్థానికులకు ఉపయోగకరంగా ఉండేందుకే అని, బస్తి యువకుల, బస్తి అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు ‘జిమ్‘ ఏర్పాటు కు తప్పకుండా కృషిచేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.

ఈ  కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బస్తి నాయకులు శ్రీనివాస్,కుమార్, సాయి కుమార్, రాజేష్, సాయి తరుణ్, భారత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.