calender_icon.png 16 January, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీటీల సమస్యలు పరిష్కరిస్తాం

09-08-2024 12:28:32 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

గజ్వేల్, ఆగస్టు 8: ఎస్జీటీల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. గురువారం గజ్వేల్ మండలంలో నిర్వహించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పీఆర్టీ యూ పక్షాన ఉపాధ్యాయుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించామని తెలిపారు. త్వరలోనే 11,12 జీవోలు సవరించి బీఈడీ అర్హత కలిగిన ఉపాధ్యాయులకు కూడా ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర శర్మ, మండల అధ్యక్ష, కార్యదర్శులు వేమారెడ్డి, లింగం, నాయకులు నరసింహారెడ్డి, కనకరాజు, శ్రీనివాస రావు, పోచయ్య గౌడ్, భాస్కర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.