calender_icon.png 14 April, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటుక, ఇసుక లారీల యజమానుల సమస్యలు పరిష్కరిస్తాం

13-04-2025 12:00:00 AM

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ఏప్రిల్ 12 : సీఎం రేవంత్ రెడ్డి సారథంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. ఆటోనగర్ లోని ఇటుక, ఇసుక లారీల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్  మాట్లాడుతూ.. యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్విని చేసుకోవాలన్నారు. సన్న బియ్యం పథకం ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందని, పేదల సంక్షేమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇసుక, ఇటుక లారీల యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆటోనగర్ ఇసుక లారీల పార్కింగ్ స్థలం విషయంలో గతంలో కొందరు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తే తాను హెచ్చరించి అడ్డుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కనకాల శ్యామ్, జాజుల లింగం గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్, కమిటీ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ , బుడ్డ సత్యనారాయణ, లారీల అసోసియేషన్ ప్రతినిధులు గుర్జ నర్సింహా గౌడ్, జగదీష్ యాదవ్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.