calender_icon.png 20 October, 2024 | 8:59 AM

గోపాలమిత్రల సమస్యలు తీరుస్తాం

20-10-2024 01:53:47 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, అక్టోబర్ 19 : సంపద పెరగాలంటే పాల ఉత్పత్తి పెరగాలని.. అందుకు గోపాలమిత్రలు, వెటర్నరీ డాక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పాడిరైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు హాజరైన పొన్నం మాట్లాడుతూ.. 1,475 మంది గోపాల మిత్రలు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు సేవలందిస్తున్నారని అభినందించారు. అలాంటి గోపాల మిత్రల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాకబోయిన రవీందర్, బందయ్య, ముఖేష్ గౌడ్, సత్యనారాయణ, రాంరెడ్డి చెరుకు శ్రీనివాస్ పాల్గొన్నారు.