calender_icon.png 1 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7,8 డివిజన్ల సమస్యలు పరిష్కరిస్తాం

29-12-2024 08:11:35 PM

నుడా చైర్మన్ కేశవ వేణు హామీ...

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని 7, 8 డివిజన్ లోని వార్డులలో అధ్యక్షుడు కేశవ వేణు పర్యటించారు. ఆయా వార్డుల్లోని ప్రజలను కలిసి వారి ఎదుర్కొంటున్న సమస్యలను మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రోజు డివిజన్ లోని అభివృద్ధి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆదేశాగా ప్రయత్నాలు మొదలు చేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్మూర్తి, గోపి, పుప్పాల రవి, వేణు, రాజు, జిల్లెల రమేష్, నవీన్, సంతోష్, కిరణ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.