అడిషనల్ డీసీపి (అడ్మిన్) సి. రాజు
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్లో పని చేస్తున్న ఏఆర్ పోలీసుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రామగుండం పోలీస్ కమీషనరేట్ అడిషనల్ డీసీపి (అడ్మిన్) సి.రాజు అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్‌ను ఆయన సందర్శించారు. సాయుధ దళ పోలీసుల సమీకరణ కవాతు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందంనం స్వీకరించారు. ఆర్ముడ్ రిజర్వ్, సాయుధ దళాల ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మోనల్ డ్రిల్, డాగ్‌స్కాడ్ సిబ్బంది ప్రదర్శించిన పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు.
ఏఆర్ పోలీసులు సివిల్ సిబ్బందికి సహాయంగా విధులను నిర్వర్తిస్తుండటం అభినందనీయమన్నారు. క్రమశిక్షణతో పని చేస్తూ మంచి పేరు సాధిస్తున్నారని అభినందించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు ధీటుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్, ఆర్ఐ ఆఫీస్, మోటార్ వెహికిల్ ఆఫీస్ రికార్డులను, బీడీ టీమ్, డాగ్ స్వాడ్, వాటర్‌ప్లాంట్ లను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట ఏఆర్ ఏసీపి సుందర్రావ్, ఆర్ఐ వామనమూర్తితో పాటు ఏఆర్ ఎస్సైలు ఉన్నారు.