10-04-2025 01:12:09 AM
గర్వ సభ్యలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హామీ
రాజేంద్రనగర్, ఏప్రిల్ 9 : మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కపూరి కాలనీలో సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ’గర్వ’ సభ్యులకు హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రేటర్ ఆల్కపురి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వెంటనే మణికొండ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలియజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కమిషనర్ కు సూచించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గర్వ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.