కామారెడ్డి కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్
కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశంలో సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలపై అర్జీలను ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ నర్సింహరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సురేందర్, డీఈవోరాజు, జడ్పీ సీఈవో చందర్ పాల్గొన్నారు.