calender_icon.png 1 April, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసును త్వరలోనే ఛేదిస్తాం

20-03-2025 02:13:40 AM

మల్టీ జోన్ 2 ఐజీపీ సత్యనారాయణ 

సూర్యాపేట, మార్చి19(విజయక్రాంతి): నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఇటీవల హత్యకు గురైన మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్  హత్య కేసును త్వరలో చేదిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మల్టీజోన్ 2 ఐజిపి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన  కుటుంబంతో  ఐజి సత్యనారాయణ,  ఎస్పీ నరసింహలు మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులపై ఆరా  తీశారు.

ఈ సందర్భంగా ఐజి సత్యనారాయణ మాట్లాడుతూ మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించామన్నారు. హత్యలో సొంత అల్లుళ్ళే ప్రాధాన పాత్ర పోషించారునీ, ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని  ఇంకా పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందనీ వివరించారు. హత్యలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.

ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం అని వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో 5 ప్రత్యేక టీములను ఏర్పాటు చేసాం అని తెలిపారు. కేసుని త్వరలోనే చేదిస్తామని స్పష్టం చేశారు. అనుమానితులు అక్రమ భూ సెటిల్మెంట్లు చేస్తునట్లు గుర్తించాం అని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

హత్య విషయంలో అజాగ్రత్తగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేస్తాం అని,  రానున్న స్థానిక ఏన్నికల నేపథ్యంలో సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చూస్తున్నట్లు ఐ జి సత్యనారాయణ వివరించారు. ఐజితో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, డిఎస్పి  జి. రవి, సిఐలు, ఎస్త్స్రలు ఉన్నారు.