10-04-2025 12:00:00 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ఏప్రిల్ 9: (విజయ క్రాంతి): నిజామాబాద్ నగర ప్రజల సమస్యలు తీర్చడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డివిజన్లలో పర్యటించారు. ఇందూర్ నగరం : 8 వ డివిజన్ లలిత నగర్, సాయిరాం నగర్, సాయి నగర్ కాలనీలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పలు వార్డుల ప్రజల సమస్యలను వారు తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూర్ నగరం సమస్యల వలయంగా మారిందనీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని వాటిని త్వరలో పరిష్కరించేల అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఎనిమిదో డివిజన్ లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య జటిలంగా ఉందని వర్షాకాలంలో స్టామ్ వాటర్, డ్రైనేజీ కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండ తగు చర్యలు తీసుకోవాలనీ ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ ఈ మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమీషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బిజెపి నాయకులు మఠం పవన్,నాగరాజు అంబాదాసు,బుస్సాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.