calender_icon.png 22 February, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలను పరిష్కరిస్తాం

21-02-2025 12:00:00 AM

జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ 

ఖమ్మం, ఫిబ్రవరి- 20 (విజయక్రాంతి) : రైతుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.గురువారం జిల్లా అటవీ అధికారి సింగరేణి మండలం తౌసీబుడు గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ సంబంధిత సమస్యలు, అటవీ హక్కుల గుర్తింపు, రహదారి కనెక్టివిటీపై నిర్వహించిన బహిరంగ గ్రామసభలో పాల్గొన్నారు.అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి వివాదాలు, ఆందోళనలు, వ్యవసాయ క్షేత్రాలకు, మార్కెట్‌కు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఆవశ్యకత, ఆహారం, నీటి కోసం వ్యవసాయ భూముల వైపు వస్తున్న వన్య ప్రాణులకు సంబంధించిన సమస్యలు, కోతుల బెడదపై రైతులు సమస్యలను లేవనెత్తారు.

ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి సిదార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ ఉపాధి హామీ క్రింద పి.టి, ఫార్మ్ పౌండ్ నిర్మాణానికి ప్రతిపాదించాలని, అటవీ మంటలను ఆపడానికి సమాచార నెట్వర్క్ నిర్మిస్తున్నామని, దీనికి రైతులు సహకరించాలని జిల్లా అటవీ అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డివో మంజుల, అటవీ అధికారులు పాల్గొన్నారు.