తెనాలీ డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్‌ప్రసాద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): గ్రామీణ ఆహారాల నాణ్యతను ప్రపంచానికి తెలియజేయడమే తమ లక్ష్యమని తెనాలీ డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు ఢిల్లీలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్‌లో జరిగిన ‘ఇండస్ ఫుడ్ 2025’లో గ్రామీణ ఆహార వారసత్వానికి అంకితమైన తమ సంస్థ పాల్గొంటున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రదర్శనలో 20 దేశాల నుంచి ఆహార ప్రాసెసింగ్ సంస్థలు, 1,800 ప్రదర్శకులు 5,000 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఇది భారతీయ గ్రామీణ ఆహా ర సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశం కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన గ్రామీణ అద్భుతాలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే తమ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
2005లో స్థాపించిన తెనాలి డబుల్ హార్స్.. నాణ్యత, ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని సృష్టించడంలో నిమగ్నమైందని చెప్పారు. ప్రతి గింజలో నమ్మకం, సంతృప్తిని అందిస్తోందని తెలిపారు. భారత దేశంలో పప్పులు పండించే రైతులు, ప్రాసెసర్లు, గిడ్డంగుల యజమానులు, విక్రేతల ప్రయోజనాలను కాపాడటంలో తెనాలి డబుల్ హార్స్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.