అలనాటి రామచంద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత శ్రీరామ్ జడపోలు
కృష్ణ వంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంవహించిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఆగస్ట్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ “ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తను రామచంద్రుడు లాంటి వాడే. చాలా ఇంట్రోవర్ట్. మంచి భావోద్వేగాలున్న సినిమా ఇది. ఆకాష్ గారు చాలా నిజాయితీగా తీశారు” అన్నారు.
“నిజాయితీతో కూడిన నేటి తరం ప్రేమకథ ఇది. కథ అనుకున్నపుడే కొత్తవారితో చేయాలని అనుకున్నాను” అని దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి తెలిపారు. ఇదే వేదికపై నిర్మాత శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ “దిల్ రాజు గారికి సినిమా నచ్చి రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. హైనివా క్రియేషన్స్‌లో మొదటి సినిమా ఇది. కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాం. ఈ తరానికి కావాల్సిన స్వచ్ఛమైన ప్రేమని మా సినిమాలో చూపించబోతున్నాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మోక్షతో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.