calender_icon.png 20 January, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ ధర్నాతో ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం

20-01-2025 01:18:53 AM

తుంగతుర్తి మాజీ  ఎమ్మెల్యే గాదరి కిశోర్ 

యాదాద్రి భువనగిరి, జనవరి 19 (విజయక్రాంతి): ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే రైతు మహా ధర్నా కార్యక్రమంతో సర్కార్‌కు తమ సత్తా చూపిస్తామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీ లిచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మెడలు వంచి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని అన్నారు.

ఆదివారం మోత్కూ ర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహా ధర్నాకు లక్షలాదిమంది రైతులు తరలివస్తారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఒత్తిడిలో తమ పార్టీ కార్యాలయలాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.