23-04-2025 12:27:46 AM
ఎమ్మెల్సీ కవితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
ఖమ్మం, ఏప్రిల్ 22( విజయక్రాంతి ): లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను విమర్శించే నైతికత లేదని ఖమ్మం నగర మేయర్ పునుకొళ్ల నీరజ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య విమర్శించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మీడియా సమావేశం లో కవిత పై ఫైర్ అయ్యారు.
ఖమ్మం వస్తే జిల్లా లో ఎంత అభివృద్ధి జరిగిందో చూపిస్తామని అన్నారు. కవిత ఖమ్మం పర్యటన లో కళ్ళుండి కాబోదిలా కాంగ్రెస్ పై విమర్శలు చేశారని ధ్వజ మెత్తారు. ఖమ్మం విచ్చేసి ఖమ్మం అభివృద్ధి పై మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించుకోవాలని లేని పక్షo లో మహిళా కాంగ్రెస్ దీటుగా స్పందిస్తుందని పేర్కొన్నారు.
పదేళ్ల అధికారంలో ఉండి ఏ ఒక్క పని ఏ ఒక్క హామీని నెరవేర్చని మీరు ఈరోజు తైతక్క మాటలు మాట్లాడుతూ కా లం ఎల్లపుచ్చుతున్నారని విమర్శించారు. మీరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మాజీ మంత్రులు మీ మాజీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు.
పదేళ్లు రాజబోగాలు అనుభవించి నేడు రాష్ట్రాన్ని అభాసు పాలు చేసి అప్పుల పాలు చేసి ఖమ్మం వచ్చి కలబొల్లి మాటలు చెప్పి ప్రజలను మాయపుచ్చాలనుకుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు.బీ ఆర్ ఎస్ కు ఆల్రెడీ బుద్ధి చెప్పామని ఇలాంటి వ్యవహారాలు మానుకుంటే మంచిదని అన్నారు.
మీడియా సమావేశం లో పార్టీ 11వ డివిజన్ అధ్యక్షురాలు సుగుణ, 24వ డివిజన్ అధ్యక్షురాలు భార్గవి, 39వ డివిజన్ అధ్యక్షురాలు చంద్రిక, మహిళా కాంగ్రెస్ నాయకులు రాయల కృష్ణవేణి, గుంటి భవాని, బలుసు లక్ష్మి, నసీమా, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు