calender_icon.png 26 February, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధితోపాటు ప్రజలకు సేవ చేస్తా..

29-01-2025 01:33:53 AM

శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ 

వికారాబాద్, జనవరి- 28 : అభివృద్ధితో పాటు ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యమని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం   కోట్ పల్లి మండలం బుగ్గాపురం డిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి, షాది ముభారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు స్పీకర్ పంపిణీ చేశారు. 

వికారాబాద్ డివిజన్ తాండూర్ నియోజక వర్గం (కోట్ పల్లి) 18, వికారాబాద్ నియోజక వర్గం ( కోట్ పల్లి) లకు సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ కింద 48,05,568 రూపాయల చెక్కులను,   ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలుగురు లబ్ధిదారులకు సభాపతి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ...ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, జిల్లా అభివృద్ధికి, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడంలో కృత నిశ్చయంతో ఉందని సభాపతి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జి.అంజయ్య, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ డానియల్, స్థానిక నాయకులు  పాల్గొన్నారు.