calender_icon.png 11 October, 2024 | 7:52 AM

సెబీ ఉత్తర్వులు సమీక్షించి, లీగల్ చర్యలు తీసుకుంటాం

26-08-2024 12:30:00 AM

అనీల్ అంబానీ

న్యూఢిల్లీ, ఆగస్టు 25: మార్కెట్ రెగ్యులేటర్ తనపై విధించిన నిషేధంపై పారి శ్రామి కవేత్త అనీల్ అంబానీ ఆదివారం స్పందించారు. సెబీ ఉత్తర్వులను సమీక్షిస్తున్నామని, తదుపరి న్యాయపరమైన సలహా లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అంబానీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.  రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) నుంచి నిధులు మళ్లించారని ఆరోపిస్తూ అనీల్ అంబానీని ఐదేండ్లపాటు క్యాపిటల్ మార్కెట్ నుంచి సెబీ నిషేధంతో పాటు రూ.25 కోట్ల జరిమానాను విధిస్తూ తుది ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. 

ఎటువంటి లిస్టెడ్ కంపెనీలోనూ, సెబీ రిజిష్టర్డ్ సంస్థలోనూ డైరెక్టర్‌గా లేదా కీలక నిర్వహణా హోదాలో ఐదేండ్లపాటు ఉండరాదని అనిల్‌ను సెబీ ఆదేశించింది.  మరో 24 సంస్థలు, వ్యక్తులకు సైతం రూ.21 కోట్ల నుంచి రూ. 27 కోట్ల జరిమానాను విధించింది. అందులో ఆర్‌హెచ్ ఎఫ్‌ఎ ల్ నుంచి నిధులు మళ్లింపునకు సహకరించిన ఆ సం స్థ అధికారులు, నిధుల్ని అందు కున్న అనీల్‌కు పరోక్షంగా సంబంధం ఉన్న కంపెనీలూ ఉన్నాయి.

సెబీ 2022 ఫిబ్రవరిలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రిల యన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ బో ర్డుల నుంచి అంబానీ రాజీనామా చేశారని, రెండున్నర ఏండ్ల నుంచి మధ్యంతర ఉత్తర్వులను పాటిస్తున్నారని తాజాగా  ఆయన ప్రతి నిధి వివరించారు. ఈ ఆగస్టు 22న సెబీ జా రీచేసిన తుది ఉత్తర్వులను అం బానీ సమీక్షిస్తున్నారని, న్యాయనిపుణుల సలహాల ప్రకా రం తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.