న్యూఢిల్లీ, జూలై 19 : దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటపరం చేసే ఏ చర్యనైనా గట్టిగా తి ప్పి కొడుతామని, ఇలాంటి చర్యలను పార్లమెంటు లోపల, వెలుపల ప్రతిఘటిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్ర భుత్వ వాటాను 51 శాతం కంటే తక్కువకు తగ్గించే ఏ చర్యనైనా అడ్డుకుంటామన్నారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 55 ఏళ్ల క్రితం ఇదే రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జా తీయం చేసి భారత ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీశారని గు ర్తు చేశారు. నాటి ప్రధాని ఇందిరా తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ నిర్ణయం దేశంలోని వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇతర ప్రాధాన్యత రంగాలకు ఊతమిచ్చిందని గుర్తు చేశారు. మోదీ హయాంలో గత ఏడేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీ నాలు జరిగాయని ఆరోపించారు.