డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రైవేట్ కాళాశాలల ఫీజు బకాయి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి, ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నాయకులతో భట్టి సమావేశమై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలకు సంబంధించిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామని మంత్రి చెప్పారు.