calender_icon.png 8 April, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తాం

07-04-2025 07:24:58 PM

డి.ఇ. విజయ సారధి..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నాడు నిర్వహించిన విద్యుత్తు ప్రజావాణి కార్యక్రమంలో ఎల్లారెడ్డి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ విజయ సారధి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వినియోగదారుల నుండి నేరుగా ఫిర్యాదులు అందుకున్నారు. నేడు వినియోగదారుని నుండి ఒక ఫిర్యాదు వచ్చిందని అన్నారు. ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని వినియోగదారులు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా విద్యుత్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని విద్యుత్ వినియోగదారులకు సూచించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే వారికి విద్యుత్ శాఖ నిబంధనల మేరకు తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.