calender_icon.png 3 April, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తాం

26-03-2025 12:47:00 AM

ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ సందర్శన

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మార్చి 25 ( విజయక్రాంతి ) : ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డి పల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్ తో కలిసి పరిశీలించారు. వెంకట్ రాములు అనే వరి రైతు పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

సంకిరెడ్డి పల్లి లో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట డామేజ్ అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా, వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం 170 ఎకరాల్లో పంట డామేజ్ అయిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగండ్లు, అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని తెలిపారు. 

 ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ సందర్శన

 కొత్తకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను కలెక్టర్ సందర్శించారు. వేగంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. ఇంకా మోడల్ హౌస్ నిర్మాణం ప్రారంభం కాని మండలాల్లో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ పీడీ పర్వతలు, డి ఈ విటోభా, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.