07-03-2025 12:07:12 AM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): చెరువుల అభివృద్ధిలో ఎక్క డా ఆటంకాలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్దచె రువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ నిధులను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో తలెత్తిన ఇబ్బం ఈ సందర్భంగా అక్కడ పనులు చేపట్టిన ఎన్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇరిగేషన్ అధికారులతో మా చెరువులోకి మురుగునీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యతను సందర్శిం చుకునేలా ఈ చెరువు పరిసరాలను అభివృద్ధి చేయాలని ఆ సంస్థ ఏజీఎం వరప్రసాద్‌కు కమిషనర్ సూచించారు. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణలను ఇటీవల తొలగించామని.. ఇప్ప ఈ చెరువును కొన్ని సంస్థలు దత్తత తీసుకున్నాయని, పనులు వేగంగా జరగాలని సూచించారు.
దుర్గంచెరువు, ఖాజా గూ చెరువు, మల్కం చెరువు, ఫిలీంనగర్ చెరువుల నుంచి వరదనీరు ఇబ్రహీంబాగ్ చెరు చేరేదని స్థానికులు, అధికారులు తెలిపారు. నివాసప్రాంతాలు పెరిగిపోవడంతో ఈ చెరువులు, నాళాలు మురుగుతో నిండిపోయాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 88 ఎకరాలకు పైగా ఉన్న చెరువు చుట్టూ తిరిగి.. చెరువు అభివృద్ధికి ఉండే అవకాశాలను కమిషనర్ స్థాని చర్చించారు.