సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎర్నా
ముషీరాబాద్, నవంబర్ 28: ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎర్నా తెలిపారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నుంచి సీజీఓ టవర్స్ వరకు ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు.
ఏసీపీ ఎర్నా మాట్లాడుతూ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. వ్యాపారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ వీరేశం, ఎస్ఐలు కార్తీక్, యాదగిరి, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్ సిబ్బంది పాల్గొన్నారు.