మంథని, జనవరి7 (విజయక్రాంతి): మంథని పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథని పట్టణానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులనతో రూ. 24.05 కోట్ల రూపాయల నిధులతో మంజూ రైన అభివృద్ధి పనులకు రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం జిల్లా కలెక్టర్, జేసి, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
మంథని పట్టణంలో రూ. 6 కోట్ల 71 లక్షలతో హైమాస్ లైట్స్ లను, సోలార్ పనులను, రూ. 8 కోట్ల14 లక్షలతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పలు వార్డ్ లో సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్ల నిర్మాణ పనులతో పాటు, రూ. 9 కోట్ల 20 లక్షలతో మంథని మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణం, డంపింగ్ యార్డ్, సిగ్రేషన్ షెడ్, డీఆర్సీసి కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జి, పట్టణానికి ఆర్చీల నిర్మాణలకు వేరు వేరుగా మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, మంథని ఆర్డీఓ కె.సురేష్, మంథని ఎమ్మార్వో రాజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ దేవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్లు, అధికారులు, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.