25-04-2025 12:00:00 AM
రౌడీ షీటర్లకు ఎస్పీ మహాజన్ హెచ్చరిక
ఆదిలాబాద్, ఏప్రిల్24(విజయక్రాంతి): రౌడీ, గుండాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు తమ ప్రవర్తన మార్చుకోకపోతే అన్ని రకాలుగా అణచివేస్తామని, అవసర మైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో రౌడీ మేళ సమావేశం నిర్వహించి, పలు విధాలుగా వారిని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్లు తొలగించి సరైన న్యాయం చేస్తామని తెలిపారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూ లు చేయడం, రౌడీయిజం చేయడం లాంటివి మానుకోవాలని, రౌడీలపై ఉన్న కేసుల వివరాలను ప్రత్యక్షంగా పర్యవే క్షిస్తూ, నమోదైన కేసులను న్యాయస్థానాలలో శిక్ష పడేవిధం గా కృషి చేస్తూ బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నా రు.
జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణ కల్పించడానికి తన వంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తూ విధులు నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలను భయభ్రాంతులను గురి చేయడం, లాంటివి చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ ఋలు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, సాయినాథ్, ఫణిధర్ పాల్గొన్నారు.