కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: వ్యయ నాణ్యత మెరుగుపర్చడం, సామాజిక భద్రతను పటిష్టపర్చడంపై ప్రభుత్వం ఫోకస్ కొనసాగిస్తూ నే వచ్చే 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభకు సమర్పించిన డాక్యుమెంట్‌లో పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించే లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపింది. 2025 ద్రవ్యలోటును 4.5 శాతానికి దించుతామని 2021 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతంగా గత బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో రూ.4.75 లక్షల కోట్ల ద్రవ్యలోటు నమోదయ్యింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 29.4 శాతం.