calender_icon.png 4 October, 2024 | 2:58 AM

సీవరేజీ సమస్యలను తగ్గిస్తాం

04-10-2024 12:50:33 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 3(విజయక్రాంతి): సీవరేజీ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. సీవరేజీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఓఅండ్‌ఎం కూకట్‌పల్లి డివిజన్‌లోని కేపీహెచ్‌బీ, ఫేజ్ కైత్లాపూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సీవరేజీ డీసిల్టింగ్ పనులను గురువారం ఆయన పరిశీలించారు.

ఆయన మాట్లాడుతూ.. మ్యాన్ హోళ్ల లో కంకర, ఇసుక చేరి ప్రతి 20రోజులకోసారి వస్తున్న సీవరేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదే శించారు. ధ్వంసమైన మ్యాన్‌హో ళ్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త మ్యాన్‌హోళ్లను నిర్మించాలన్నారు. ప్రతీ ఆరు ఇళ్లకు ఒక కమ్యూనిటీ సిల్ట్ చాంబర్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈడీ పర్యటన

ఓఅండ్‌ఎం డివిజన్ 7 పరిధిలోని శ్రీనివాస్‌నగర్, నల్లగుట్ట ప్రాంతాల్లో జలమం డలి ఈడీ మయాంక్ మిట్టల్ గురువారం పర్యటించారు. తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, సప్లు లెవల్స్, మురుగు నిర్వహణ పనులను పరిశీలించారు.