calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కష్టపడినవారిని గుర్తిస్తాం

17-04-2025 01:17:28 AM

* నామినేటెడ్ పదవుల్లోనూ గుర్తింపు ఉంటుంది 

* సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసు నిరసిస్తూ ధర్నాను విజయవంతం చేయాలి 

* టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

* కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ పార్టీలో కష్టపడినవారిని గుర్తించి, ప్రోత్సహిస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,  మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ  ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని మధు యాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం హ యత్ నగర్ టీ- నగర్ కాలనీలో నిర్వహించారు. పార్టీ పటిష్టత కోసం చేయాల్సిన కా ర్యక్రమాలపై చర్చించారు.

డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడం, కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయాలపై  నాయకులు, కార్యకర్తలతో చర్చించి.. సలహా లు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తిస్తామని, నామినేటెడ్ పదవుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు.

తన కుటుంబ సభ్యులు ఎవ రూ రాజకీయాల్లో లేరని, నాయకులు, కార్యకర్తలే తన రాజకీయ వారసులని పేర్కొ న్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాకుండా, ఇ ప్పటినుంచే పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తుం దని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నా ము అనేది ప్రజలకు వివరించాలని సూచించారు. 

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన అనుచ రులు చేస్తున్న అక్రమాలు, ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీ డియాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, వచ్చే విమర్శల పైనా దీటుగా స్పందించాలన్నారు. నేషనల్ హెరాల్ విషయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పై అక్రమంగా కేసులు నమోదును నిరసి స్తూ గురువారం ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నాలో ఎల్బీనగర్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 

కార్యక్రమంలో రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, సీనియర్ నేత ముద్దగొని రామ్మోహన్ గౌడ్,  కా ర్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి,  సుజాత నాయక్, టీపీసీసీ కార్యద ర్శి గజ్జి భాస్కర్ యాదవ్ గారు, యూత్ కాం గ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి,  మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాశ్ గౌడ్, మ హిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లింగా ల కిశోర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, కుట్ల నర్సింహ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పథకంతో బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయి 

హయత్ నగర్‌లోని రేషన్ షాపు సందర్శన.. సన్న బియ్యం పంపిణీ పరిశీలన

ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకంతో బీఆర్‌ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, అందుకే ఆ పార్టీ నాయకుడు హరీశ్ రావు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. హయత్ నగర్ పాత గ్రామంలోని రేషన్ షాపును మధుయాష్కీ గౌడ్ బుధవారం సాయంత్రం సందర్శించారు. సన్న బియ్యం అందుతున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

వారంతా కూడా సన్న బియ్యాన్ని ప్రభుత్వ  అందిస్తుండడంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంటే ఓర్వలేక నూకలు వస్తున్నాయంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని  బీఆర్‌ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి కూడా నూకలు చెల్లాయని ఎద్దేవా చేశారు. పేదలకు సన్న బియ్యం అందజేయడం నా కల అని సీఎం రేవంత్ రెడ్డి  అందిస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.