ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మధుస్మిత
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ వార్షిక లక్ష్యాన్ని చేరుకుంటామని ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మథాలి మధుస్మిత తెలిపారు. హైదరాబాద్‌లో ఎఫ్‌టీసీసీఐ సోమవారం నిర్వ హించిన ఇంటరాక్టివ్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఏపీకి కలిపి ఆదాయపు పన్ను శాఖ వార్షిక లక్ష్యం రూ.1.21లక్షల కోట్లు కాగా.. ఇప్పటికే రూ.59 వేలకోట్లు వసూలైనట్లు చెప్పారు. చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఇన్‌కమ్ ట్యాక్ ఆదాయం ఈసారి 15శాతం వృద్ధి రేటును చూపుతోందని వెల్లడించారు. అయితే తెలంగా ణ గతేడాది 22శాతం వృద్ధిని సాధించగా.. ఈసారి 15శాతానికే పరిమిత మైనట్లు చెప్పారు.