10-04-2025 01:13:59 AM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 9 : ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్విధాలుగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్టి కాలనీలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ను బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు తగినంత నీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
బండ్లగూడ జాగర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.