ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 22: కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియను గ్రామ సభల ద్వారా ఎన్నుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అందులో భాగంగానే బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామన్నారు. గ్రామ సభలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
అనాజ్‌పూర్‌లో నివసించే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలతో పాటు, సామాజిక భవనాలు నిర్మిస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి భూమిలేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి అర్హులైన వారిని ఎంపిక చేసి.. సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోలేద న్నారు.
10 ఏండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేద న్నారు. నిరుపేదలకు ఇల్లు కానీ, ఇండ్లు స్థలాలు కానీ ఇచ్చిన దాఖలులేవన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, మాజీ జెడ్పీటీసీ బింగి దాసు గౌడ్, ఎంఆర్‌ఆర్ యువసేన ప్రెసిడెంట్ బుర్ర మహేందర్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు, అనాజ్‌పూర్ గ్రామ కార్యదర్శి సూరిబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.