నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్
నల్లగొండ, జనవరి 23 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ అన్నారు. ప్రజా పాలన గ్రామసభలో భాగంగా గురువారం ఆమె చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు.
గ్రామసభల ద్వారా ఇప్పటివరకు ఏ ఒక్కరికి రేషన్ కార్డు కానీ ,ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. రేషన్ కార్డులకు కూడా ఇది వరకే ఈ సేవ ,ప్రజా పాలన, మండలాల లో సమర్పించిన దరఖాస్తులు ,ప్రస్తుతం కొంతమంది గ్రామసభల్లో కూడా ఇస్తున్నారని వాటిని స్వీకరిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
గ్రామసభలు అయిపోయిన తర్వాత కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపిడిఓ కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్లు చిట్యాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ , గర్భిణీలు, చిన్నపిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, పిల్లల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు