calender_icon.png 8 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్లాట్లను అందజేస్తాం

08-02-2025 01:38:39 AM

  1. చక్రపురి, రాజగోపాలనగర్ కాలనీల సమస్యలపై విచారణ చేపడుతాం
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్

పటాన్‌చెరు, ఫిబ్రవరి 7: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ రాజగోపాల్‌నగర్, చక్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం చక్రపురి కాలనీలో సమావే కోర్టు ఆర్డరును ధిక్కరించి చక్రపురి కాలనీలోని నాలుగు వందల ప్లాట్లను, సుమారు 18 ఎకరాల భూమిని ఆక్రమించారని చక్రపురి కాలనీవాసులు, తమను భయ  తమ ప్లాట్లను కొందరు అక్రమం  అమ్మకాలు చేస్తున్నారని ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ కాలనీవాసులు గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన చక్రపురి కాలనీలో రెండు కాలనీల అసోసియేషన్‌లతో సమావేశం నిర్వహించారు. చక్రపురి కాలనీ ప్లాట్స్ ఓనర్స్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 88 ఎకరాల హుడా ఫైనల్ లే అవుట్‌లో విజయ్‌కృష్ణ అనే వ్యక్తి నకిలీ సర్వేనంబర్లు సృష్టించి 18 ఎకరాలు కాజే   ప్రయత్నించాడని ప్రజావాణిలో చక్రపురి కాలనీ ప్లాట్స్ ఓనర్సు ఫిర్యాదు చేశారు. వారందిరితో మాట్లాడిన కమిషనర్ రంగనా  పూర్తి ఆధారాలు తీసుకొని సర్వే చేయిం  న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్లాట్లను అందజేస్తాని తెలిపారు. 

రంగనాథ్‌తో సుప్రీంకోర్టు న్యాయవాది వాగ్వాదం

రాజగోపాల్‌నగర్‌కాలనీ ప్లాట్స్ ఓనర్స్‌తో రంగనాథ్ మాట్లాడుతుండగా ఐలా  గ్రామ వాసి, సుప్రీంకోర్టు న్యాయవా  ముఖీం కల్పించుకుని.. ఐలాపూర్‌కు సంబంధించిన భూముల సమస్య కోర్టులో ఉండగా మీరు ఎలా వస్తారని రంగనాథ్‌ను ప్రశ్నించారు.సగం నాలెడ్జితో మాట్లాడి ఇక్క  ప్రజలను రెచ్చగొట్టద్దని రంగనాథ్ సీరియస్ అయ్యారు.

మీకు తెలుగు చదవడం వచ్చా అంటూ రంగనాథ్‌ను ముఖీం ప్రశ్నించారు. మీరు చెప్పేది చెప్పండి ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ హెచ్చరించారు. చట్టాలపై తన  పూర్తి అవగాహన ఉన్నదని, హైడ్రా ప్రజల కోసం పని చేస్తుందని రంగనాథ్ ము  అన్నారు. ఉద్రిక్తత నెలకొనే పరిస్థితి ఉండటంతో పోలీసులు ముఖీంను అక్కడి నుంచి బయటకు పంపించారు. 

సూరం చెరువు పరిశీలన

మహేశ్వరం, ఫిబ్రవరి 7: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూరం చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన స్పందించారు. శుక్రవారం హైడ్రా అధికారులతో కలిసి తుక్కుగూడ సూరం చెరువును రంగనాథ్ పరిశీలించారు.

సూరం చెరువు 60 ఎకరాలు ఉండగా కాల క్రమంలో కేవలం 25 ఎకరాలు మాత్రమే చెరువు మిగిలిందని సంబంధిత అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.