calender_icon.png 2 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందిస్తాం

31-03-2025 12:00:00 AM

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్

గోదావరిఖని మార్చి 30విజయక్రాంతి: రామగుండం కార్పొరేషన్ పరిధి 43వ డివిజన్ లో ప్రభుత్వం అమలు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాన్ని ఏర్పాటు చేసి మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇదే క్రమంలో రామగుండం కార్పొరేషన్ లో గతంలో ఉన్న 89 వేల కింటాళ్ల సన్న బియ్యం పంపిణీతో పాటు మరో పదివేల కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రామగుండం ఎమ్మార్వో కుమార స్వామితో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.