calender_icon.png 23 February, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన విద్యుత్ సరఫరాయే తన లక్ష్యం

22-02-2025 06:56:01 PM

తలకొండపల్లి,(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలో మెరుగైన విద్యుత్ సరఫరాయే తన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన చోట నూతన విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించి రైతులకు,ఇండస్ట్రియల్ సంస్థలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. అందులో భాగంగా శనివారం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబరు 252లో మండల తహసిల్దార్ నాగార్జునతో కలిసి నూతన 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.సబ్ స్టేషన్ నిర్మాణానికి 1ఎకరం స్థలం గుర్తించినట్లు తహసిల్దార్ నాగార్జున తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి,మార్కెట్ కమిటి డైరెక్టర్ అజీం,మాజీ ఎంపిపి లక్ష్మీదేవిరఘురాములు,ఎర్వ రాజలింగం,డేవిడ్,కాగుల కుమార్,మండల విద్యుత్ అదికారులు పాల్గొన్నారు.