calender_icon.png 6 March, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు దారి చూపాలన్నదే నా సంకల్పం

06-03-2025 12:41:28 AM

విద్య అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, మార్చి 5 (విజయ క్రాంతి) : మీరు కు మంచి దారి చూపాలని సంకల్పంతోనే విద్యా నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణం లోని ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాల లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించి,  అనంతరం సివిల్ సర్వీసెస్ మరియు బ్యాంకింగ్ కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఉచిత ఫౌండేషన్ కోర్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  మహబూబ్ నగర్ దశ దిశ ను మార్చాలని, మీలాంటి వారికి దారి చూపాలని  నేను రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే గా గెలిచానని  ఆయన స్పష్టం చేశారు. 

మీకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన చెప్పారు. మీరు ఏ సబ్జెక్టులో  డిగ్రీ చేస్తున్నా ,  కాంపిటీటివ్ ఎగ్జామ్ లో రాణించాలంటే అన్ని సబ్జెక్టుల పైన  పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు.   ప్రభుత్వ ఉద్యోగాల్లో నే కాదు  ప్రైవేటు ఉద్యోగాల్లో రాణించాలన్నా మనకు జనరల్ నాలెడ్జ్  అవసరమని అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా దిన పత్రికలను చదువాలని,  దినపత్రికలను చదవడం వల్ల ప్రపంచంలో జరిగే అనేక విషయాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. అందుకే  ప్రతి ఒక్కరూ  ఏదేన ఒక జాతీయ వార్తా పత్రికను చదివే అలవాటు నేర్చుకోవాలని ఆయన సూచించారు.  మన ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాల లో కర్నాటక రాష్ర్టంలోని హుబ్లీ  కేంద్రంగా పనిచేస్తున్న దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.   

హుబ్లీ లో రెండు రోజులపాటు జరిగిన దేశ్ పాండే ఫౌండేషన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం జరిగిందని,  వచ్చే సోమవారం దేశ్ పాండే ఫౌండేషన్ నిర్వాహకులు కళాశాలను సందర్శించే అవకాశం ఉందన్నారు.  గొప్ప సంకల్పంతో అడుగులు వేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మ ల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేం ద్ర ప్రసాద్, కో ఆర్డినేటర్ డాక్టర్ పద్మ అనురాధ, బిసి స్టడీ సర్కిల్ భవాని శంకర్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు ముకుందం రమేష్, శివ జోగి, నరేష్, శ్యాంసుందర్, రమేష్ సాగర్, యాదగిరి పాల్గొన్నారు.