calender_icon.png 26 November, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే రైతు భరోసా ఇస్తాం

26-11-2024 01:55:06 AM

హుజూరాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం 

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, నవంబర్ 25 (విజయక్రాంతి): దేశానికి దిక్సూచిగా కులగణన సర్వే నిలవనున్నదని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. చైర్మన్‌గా గూడూరి రాజేశ్వరిస్వామిరెడ్డి, వైస్ చైర్మన్‌గా నాంపల్లి తిరుపతితోపాటు కమిటీ సభ్యులచేత ప్రమా ణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..

రైతుల సంక్షేమం గురించి ఎల్లప్పుడు కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రుణమాఫీ చేశామన్నారు. రూ.2 లక్షలకుపైగా ఉన్నవారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజూరాబాద్ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ పాల్గొన్నారు. కాగా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.