calender_icon.png 10 January, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతికి రైతుభరోసా ఇస్తాం

31-12-2024 03:11:54 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంక్రాంతి నాటికి విధి విధానాలన్నీ పూర్తి చేసి, రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సాగుదారులకు మాత్రమే రైతుభరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నదని, క్యాబినెట్‌లో చర్చించి, రైతులకు సానుకూలమైన నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. అన్నారు. రుణమాఫీ కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతున్నదన్నారు. సాధ్యమైనంత త్వరగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

గోదా వరి జలాలను ఖమ్మం జిల్లా మొత్తానికి తీసుకువచ్చి, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే తన జీవిత ధ్యేయమని అన్నారు. ఆగ స్టు నాటికి యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేటకు సాగునీరందిస్తామన్నారు. ఖమ్మం నగరానికి మణిహారంగా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా జరగబోతున్నదని తెలిపారు.

జనవరి మొద టి వారంలో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రఘునాథపాలెం మండలాన్ని సస్య శ్యామలం చేసే మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంక్రాంతి రోజున శంకు స్థాపన చేస్తామని  తెలిపారు. రెండు నెలలో ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిని అందుబాటులో తెస్తామని చెప్పారు.

కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై  నిపుణుల కమిటీ నివేదిక అందగానే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.