calender_icon.png 4 April, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి మార్కెట్‌లో సౌకర్యాలు కల్పిస్తాం

21-03-2025 01:38:05 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, మార్చి 20 (విజయ క్రాంతి): రాబోయే సీజన్ ను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ మామిడి మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో రు.1 కోటి 70 లక్షలతో నిర్మిస్తున్న ఫ్లాట్ఫామ్ పరిశీలించి పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

మామిడి  మార్కెట్ లో రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో రు.1 కోటి తో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మార్కెట్ అభివృద్ధికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రూ. 7 కోట్ల తో మ్యంగో మార్కెట్లో  షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

గత కాంగ్రెస్ హయంలో 1974లో చల్గల్ వాలంతరీ కేంద్రం ఏర్పాటు చేయటం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 1 కోటి 70 లక్షలతో రైతులు ధాన్యం ఆరబెట్టడానికి ఫ్లాట్ ఫామ్ నిర్మాణం చేపట్టామన్నారు. తనకు రెండవ సారి అవకాశం కల్పించిన రైతులకు, మార్కెట్ లను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

రాష్ట్రం లో 52 మార్కెట్ లకు గాను జగిత్యాల, రాయికల్ మార్కెట్లకు మాత్రమే నిదులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.  త్వరలోనే సీడ్ ప్రసెస్ యూనిట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు దామోదర్ రావు, రాధ రవీందర్ రెడ్డి, నాయకులు ఎల్లారెడ్డి, సురేందర్’రావు, బాలా ముకుందం,మహేశ్వర్ రావు, గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.