calender_icon.png 5 January, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తాం

01-01-2025 02:05:52 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, డిసెంబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిచడమే ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హూజూర్‌నగర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలసి సందర్శించి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, మరి కొద్ది రోజుల్లో మరో ఆరు వేల ఉపాధ్యాయ ని యామకాలు చేపడతామన్నారు.

ఈ సంద ర్భంగా విద్యార్థులతో కలసి మంత్రి, కలెక్టర్ భోజనం చేశారు. నూ తన సంవత్సర వేడుకలు పేద విద్యార్థులతో కలసి చేసుకోవడానికే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.