20-04-2025 12:50:26 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సేవలందిస్తూ ఆంధప్రదేశ్ మహేశ్ కోబూ అర్బన్ బ్యాంక్ ప్రముఖ బ్యాంకుగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం అత్యాధుని క సదుపాయాలతో కూడిన రెండు ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది. సీతాఫల్ మండీ, చంపాపేట్‌లోని బ్రాంచ్ పరిసరాల్లో బ్యాంకు అధికారులు వీటిని ఏర్పాటు చేశారు.
ఏటీఎంల ప్రారంభోత్సం సందర్భంగా బ్యాంకు డైరెక్టర్ అరుణ్‌కుమార్ భంగాడి యా మాట్లాడుతూ.. కస్టమర్లకు సెక్యూరిటీ తో కూడిన మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు కట్టుబడి ఉందనడానికి ఏటీ ఎంల ఏర్పాటే నిదర్శనమని పేర్కొన్నారు. బ్యాంకు ఎండీ, సీఈవో వీ.అరవింద్ మాట్లాడుతూ.. ఈ ఏటీఎంలకు సంబంధించిన లెటెస్ట్ ఫీచర్లను వివరించారు.