27-02-2025 01:29:12 AM
సంగారెడ్డి, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అమీన్ పూర్ లో కొత్తగా బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ని ప్రారంభించామని హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ జి.ఎస్.డి. ప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. అమీన్పూర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆధునిక సౌకర్యాలతో బ్రాంచ్ ని ప్రారంభించామన్నారు.
స్థానిక ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అమీన్పూర్ ప్రాంతంలో రిటైల్, మిడ్ కార్పొరేట్ వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నందున, బ్రాంచ్ ప్రత్యేక దృష్టితో ఏర్పాటు చేసిందన్నారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ కె.ఇ. హరికృష్ణ మాట్లాడుతూ.. అమీన్పూర్ బ్రాంచ్ ప్రారంభం మా బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించడానికి ఒక కీలకమైన అడుగు అన్నారు.
మా రిటైల్ కస్టమర్లకు, ముఖ్యంగా సూక్ష్మస్థాయి వ్యాపారులకు సమగ్ర బ్యాంకింగ్ కేంద్రంగా మారి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచుతుందన్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలలో 30 మిలియన్ల కస్టమర్లకు 2400 కంటే ఎక్కువ బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తోందిన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మొత్తం 72 బ్రాంచ్లు ఏర్పాటు కావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.