calender_icon.png 25 December, 2024 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తాం

02-11-2024 02:40:19 AM

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని కాస్తూర్బా విద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థినులు ఇటీవల అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. యాజమా న్యం వారిని పెద్దపల్లి జిల్లా దవాఖానకు తరలించి వైద్యం అందించగా, వీరిలో రక్షిత, రేవతి, సునీత అనే విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ కుమార్‌తో కలిసి శుక్రవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆసుపత్రి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థి తులపై వైద్యులను ఆరా తీశారు. విద్యార్థులు పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జి చేయాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.