11-02-2025 12:00:00 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : జిల్లాలో అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఐటీడీఏ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బారులో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించారు.
మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అరులైన ప్రతి గిరిజన కుటుంబాలకు జీవనోపాధి పెంపొందించుకోవడానికి యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సోమవారం వచ్చిన దరఖాస్తులలో పోడు భూములు సమస్యలు, రైతుబంధు, రుణాలు, పోడు భూములకు పట్టాల కొరకు, వ్యవసాయానికి సంబంధించిన కరెంటు మోటారు కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు, ట్రై కార్ సబ్సిడీ రుణాల కోసం, నూతనంగా ఇసుక సొసైటీలు ఏర్పాటు కొరకు, సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇప్పించుట, ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కోసం, కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్లు, వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు ఇప్పించుట కొరకు గిరిజనులు దరఖాస్తులు సమర్పించా రని అన్నారు.
గిరిజన దర్బార్‌లో సమర్పించిన అర్జీలను ప్రత్యేకమైన రిజిస్టర్లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి ప్రతి గిరిజన కుటుంబాలను విడతల వారీగా వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏఒ సున్నం రాంబాబు, డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఎస్‌ఓ ఉదయ భాస్కర్, ఏపిఓ పవర్ వేణు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, ఎల్‌టిఆర్‌డిటీ మనిధర్, డియంజిసిసి సమ్మయ్య, మేనేజర్ ఆదినారాయణ, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు, హెఈఓ లింగ నాయక్, ఐసిడిఎస్ సూపర్వుజర్ రాజేశ్వరి, జేడీఎం హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.